తెల్లని దుస్తులు ఎలాంటి అకేషన్ కయినా చక్కగా సూటవుతాయి. సింపుల్గా ఆఫిస్ కి కాలేజీ కి అయినా, మంచి వేడుకలకైనా తెల్లని డ్రెస్సులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అయితే దానికి తగిన యాక్సిసరీస్ వుండాలి. ముందుగా సీజన్ ని అనుసరించి ఆ యాక్సిసరీస్ తీసుకోవాలి. బ్యాగ్స్ విషయంలో కనీస మాత్రంగా గ్రాఫిక్స్ టాటో తో వుండాలి. షూ లో రైజ్ హీల్స్ తో పాయింటెడ్ పంప్స్ వుండాలి. తెలుపు క్లీన్ కాన్వాస్ లాంటిది కాబట్టి లెక్కలేనన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి. బ్యాగ్స్, షూస్ ఆభరణాలు ఏవైనా కళాత్మకంగా వుండాలి. గ్రే లేదా నేవీ షేడ్స్ బీజ్ లేదా ట్యాన్ యాక్సిసరీస్ వర్క్ అవుట్ అవ్వుతాయి. తెల్లని దుస్తులు ధరించినప్పుడు మరే యాక్సిసరీస్ గాడీగా వున్నా ముందు దుస్తుల అందం పోతుంది. చాలా తేలికైన రంగుల యాక్సిసరీస్ సరిగ్గా మాచ్ అవ్వుతాయి.

Leave a comment