Categories
Wahrevaa

అచ్చం ‘అవకడో’ లాగే ఆరోగ్యం ఇస్తాయి.

అవకడోలను సూపర్ ఫుడ్స్ అంటున్నారు. ఇవి చాలా ఖరీదైనవి, అన్ని చోట్లా దొరకవు. మరి వీటికి ప్రత్యామ్నాయం ఇక్కడ సులువుగా దొరికేవి ఎమీ ఉండవా అన్న ప్రశ్నకు సమాధానం కొబ్బరి లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడమని ఉడికించిన పాలకూర, కివిలు కూడా అవకాడోల్లాంటివే. అవకాడోలో అత్యధిక ఫ్యా ట్ వుంటుంది. ఇది ముఫా అంటే మంచి కొవ్వు, అలాగే యాంతోసియాన్లనే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు కాన్సర్ల ముప్పు నుంచి కాపాడతాయి. దృష్టికి ప్రయోజనం కలిగించే బీటాకెరోటిన్ పుష్కలంగా వుంటుంది. సరిగ్గా అవే లక్షణాలున్న దానిమ్మలో గుండె జబ్బుల్ని నివారించే గ్రానటెన్ బి, పనికలాజికల్ వంటివి లభిస్తాయి. పాలకూరలో వుండే లూటెన్ జయాక్సాంధినలు కాటరాక్ట్  నుంచి కాపాడతాయి, ఖరీదైన వాటిల్లోనే పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనుకోవడం పొరపాటు. అతి సామాన్యమైన కాయిగూరల్లో ఎన్నో విశిష్ట లక్షణాలుంటాయి.

Leave a comment