కప్తాన్ టాప్స్ చూడగానే వేసవి స్పెషల్స్ అనిపించేస్తాయి. సీతాకోక చిలుక రెక్కలు అలా అలార్చినట్లు, పూల రెక్కల పిట్ట అలా గాల్లో ఎగిరినట్లు అనిపించడం ఈ కప్తాన్ టాప్స్ ప్రత్యేకత. అయితే ఇందులో ఎంపిక ముఖ్యం టాప్స్ చాలా లూజ్ గా చేతుల పై నుంచి జారినట్లు వుంటాయి. వీటి కాంబినేషన్ గా చక్కని టైట్ ఫిట్ ప్యాంట్ ఏదైనా బావుంటుంది. ఒక వేల ఇంట్లో కుట్టాలన్నా భారీగా కత్తిరింపులు లేకుండా ఎంపిక చేసుకున్న క్లాత్ ని డ్రాఫ్టింగ్ సిద్దం చేసుకుని కుట్టేస్తే సరి. సింపుల్ గా స్టైలిష్ గా వుంటుంది. వట్టి సదా క్లాత్ తోనూ, జిగేల్ మనే రంగుల డిజైన్ల తోనూ ఇవి ఫ్యాషన్ ఐకాన్ లు. రాజుల కాలంలో పై నుంచి పాదాల వరకు ఓవర్ కోట్ లాగా వుండే వస్త్రాన్ని కప్తాన్ అనే వాల్లు దీన్ని ఊలు, కాశ్మీర్ సిల్క్, కాటన్ క్లాత్ లతో కుట్టించే వాళ్ళు. దీన్ని ఊలు, రాజ ప్రసాదాలలోని వస్త్రధారణ తరహా కాస్త ఇప్పుడో అమ్మాయిల వార్డ్ రోబ్ లో చక్కగా చూటు చేసుకుంది. దీన్ని ఇంకాస్త లూజ్ లెంగ్త్ తగ్గించి లూజ్ ఫిట్టింగ్ గార్మెంట్ గా కుర్తీ పేరు తో అమ్మాయిల ఇష్టసఖి అయిపోయింది.

Leave a comment