ఇప్పుడు అందరి ఇళ్ళల్లో వంట కాస్త తినటానికి విలుగానే వుంటుంది. యుట్యూబ్ ఓపెన్ చేస్తే అన్న కుకరీ ప్రోగ్రాంలే. చూసి చూసి అందరికి వంట వచ్చేసిందనుకుంటా. ఎలాగో ఇళ్ళల్లో వండుకుంటాం ఇక పిల్లల పుట్టిన రోజులు, పెళ్ళి రోజు, కొత్త సంవత్సరం లాంటి ప్రత్యేక దినాలోస్తే హాయిగా ఇంట్లోనే నిమిషాల్లో బేక్ చేసుకోండి అంటూ కేక్ మౌల్డ్స్ కూడా వచ్చాయి. అచ్చం బేకరీల్లో వివిధ రూపాల్లో పిల్లలకి ఇష్టమైన కేక్స్ ఉన్నట్లే. కేక్ మౌల్డ్స్ లో అల్యూమినియం నాన్స్టిక్ కేక్ ప్యాన్లు, సిలికాన్ అచ్చులు కూడా వచ్చాయి. ఈ అచ్చుల్లో నెయ్యి కానీ బేకింగ్ స్ప్రే కానీ పూసి కేక్ మిక్స్ ని ఇందులో పోసి ఓవెన్ లో బేక్ చేసి ప్లేట్లో వంచేస్తే చాలు మనం ఏ ఆకారంలో కేక్ మిక్స్ ని పోసామో, అలా కార్లు, సీతాకోకచిలుకలు, ఇళ్ళు అచ్చు గుద్దినట్టు ప్లేట్లో కనిపిస్తాయి. ఇక మనకి నచ్చేలా క్రీమ్ తో ఐసింగ్ చేస్తే చాలు. చక్కని కేక్ రెడీ……….. ఏ ఫుడ్ కలర్ వాడకుండా శుభ్రంగా మన ఇంట్లోనే!!!!!!!!!!!

Leave a comment