సింగపూర్ లోని ఛాంగి ఎయిర్ పోర్ట్ దేశం లోనే గొప్ప వింతగా చెపుతారు . ఈ విమానాశ్రయం లో పెద్ద అడవే ఉంది . ఇక్కడ నిర్మించిన రెయిన్ వెర్టిక్స్ అనే జలపాతం ఈ విమానాశ్రయాన్ని ఒక అడవి మధ్య లోయలో ఉన్నట్లుగా చూపిస్తుంది . ఈ జలపాతం పైన పగటి వేళ సూర్యకాంతి మెరిసిపోతుంది . సింగపూర్ ఈ విమానాశ్రయం లో 2000 పైగా చెట్లు లక్ష పొదరిళ్ళు ఉన్నాయి .సింగపూర్ దేశం మొత్తం ఒక నగరమంత విశాలం అంతే . కానీ అక్కడ జరిగే ప్రయోగాలు మాత్రం అనంతం సముద్రాన్ని వెనక్కి నెట్టి బయటపడ్డ భూమిపైన ఎన్నో నిర్మాణాలు చేపట్టారు .

Leave a comment