బాలీవుడ్ లో విజయవంతమైన సినీ నిర్మాతగా రిలియన్స్ మీడియా హెడ్ గా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తోంది జ్యోతి దేశ్ పాండే పదకొండు భాషలకు సంబంధించిన సినిమాలు వెబ్ సిరీస్ మ్యూజిక్ వంటి విభాగాలు ఆమె పర్యవేక్షించాలి. జి స్టూడియోస్ ఏర్పాటుచేసి సినిమాలు తీసింది. అంగ్రేజీ మీడియం నిర్మాత జ్యోతి నే. సాంప్రదాయ ఆలోచనల నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేసిన ప్రతిసారీ మహిళలు అపరాధ భావనతో కూరుకుపోతారు. ముఖ్యంగా కెరీర్ కోసం మాతృత్వం తో రాజీ పడవలసిన ప్రతిసారీ ఈ భావన రెట్టింపు అవుతోంది.ఈ ఆలోచన నుంచి బయటపడితే నే మనం కెరీర్ ని ఆస్వాదించగలం అంటోంది జ్యోతి దేశ్ పాండే ఆమె ఏరోస్ మీడియా సి.ఇ .ఓ గా కూడా పని చేసింది. ఆమెలో విశేషం ఏమిటంటే ఆమె పోలియో బాధితురాలు అదెప్పుడూ ఆమె కెరియర్ కు అడ్డం కాలేదు.

Leave a comment