నా సౌందర్య రహస్యం అమ్మ చెప్పిన చిట్కాలే అంటుంది తమన్నా. బిజీ ఆర్టిస్టు కదా మీ అందం కాపాడుకోవడానికి ఏం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు తమన్నా మేం ఆర్టిస్టులం కదా సౌందర్య పోషణ మాకు కొట్టిన పిండి అనుకుంటారు కానీ నేనయితే ఇప్పటికి అమ్మ సలహాలు పాటిస్తు ఉంటాను.అసలు అందం గురించి అస్సలు జాగ్రత్తలు ఏమి తీసుకోను సాయంత్రం షూటింగ్ అయిపోయి ప్యాకప్ చెప్పగానే మేకప్ తీసేసి అచ్చం పక్కింటి అమ్మాయిలా అయిపోవడమే. సాధరణంగా అమ్మాయిలు ఏఏ జాగ్రత్తలు తీసుకుంటారో నేను అవే ఫాలో అవుతా ఈ ఫీల్డ్ లో అందం కీలకమే కాని నేను మాత్రం నా యాక్టింగ్ పైనే దృష్టి పెడతా అంటుంది తమన్నా. ఇక నా అందం గురించి పొగడ్తలు వినబడితే మా అమ్మా,నాన్నలకు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇలా ఉన్నాను అంటే వాళ్ళకు జన్మించడం వల్లనే కదా అంటుంది తమన్నా.

Leave a comment