ధన్యవాదాలు షరాన్ వర్గీస్ అన్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్  గ్రిల్ క్రిస్ట్. కేరళ,కువైట్ ఇంకా విదేశాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయామెకు షరాన్ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసింది. ఆస్ట్రేలియా లోనే చదువుకుంది కరోనా వైరస్ ప్రపంచాన్నిచుట్టేసి ఉంది ఉద్యోగం ఎక్కడ చేయాలో షరాన్ తేల్చుకోలేక పోయింది. కువైట్ లో నర్స్ గా  పనిచేస్తున్న తల్లిని అడిగింది. నేనైతే ఇక్కడి రోగులను వదిలి  రాలేను అన్నది తల్లి. ఆ మాటే మనసులో పెట్టుకోంది షరాన్. వృద్ధులకు వైద్య సేవలు చేసే ఆరోగ్య కేంద్రంలో చేరింది ఆస్ట్రేలియాలో 60 ఏళ్లు దాటిన వాళ్లు  ఎక్కువ.నాలుగు నెలలుగా ఆ వృద్ధుల తోనే ఉంది షరాన్. ఆమె చదివి వచ్చిన యూనివర్సిటీ నుంచి కోవిడ్ -19 హెల్ప్  గ్రూప్ లో  వైద్య సేవలు అందిస్తున్న వారి వివరాలు చేస్తున్న పని గురించి  వీడియో షేర్ చేయమన్నారు.
షరాన్ తాను పనిచేస్తున్న బెరియాట్రిక్ సేవల గురించి వీడియో తీసి పంపింది.వయో వృద్ధుల సేవలో ఉన్న ఆమెను ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం కొనియాడారు.ఈమె సేవలకు దొరికిన బహుమానం అది.

Leave a comment