నీహారికా ,

ఎంత స్థాయి ఉద్యోగం చేస్తున్నా కనిపించని అణచివేత స్పర్శకు తెలుస్తోంది అన్నావు. బాగా గుర్తించావు. ఈ పరోక్ష వివక్ష కు నువ్వే సంధానం చెప్పాలిసుమా.. ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఒక సమావేశం జరుగుతుందనుకో. ఆడవాళ్లే సర్వింగ్ అంతా చేస్తారనుకుంటారు. అలంటి వడింపులు  ఇక్కడ అందరూ ఉద్యోగులే కనుక అందరూ చేయాలి అని నీకు నువ్వే చెక్ పెట్టుకోవాలి. నలుగురు ఆడపిల్లలు మాట్లాడుకొంటుంటే ఆడవాళ్ల మీటింగ్ అనేశారనుకో వెంటనే తప్పు ఎవరైనా అలా మాట్లాడుకుంటారు అనచ్చు. స్త్రీలుగా మన స్థాయిని తగ్గించి మాటలివి. ఎవరైనా ప్రసూతి సెలవుపై వెళుతుంటే ఇంకేం చేస్తావు జాబ్ . పిల్లల్ని పెంచాలికదా అని సహుద్యోగి కామెంట్ చేస్తే వూరుకోవద్దు. ఇదే తండ్రివి అయ్యావు కదా నీ జాబ్ మానేస్తావా అని ఎవరైనా అంటారు. పుట్టిన బిడ్డ ఇద్దరి పెంపకంలో ఉండాలన్న భావన నీ మనసులో ఉంటే సరైన సమాధానం ఇవ్వటం చేతనవుతుంది. నువ్వు బాస్ ప్లేస్ లో వున్నావు. నెమ్మదిగా జాలిగా వ్యవహరిస్తే అది చేతకానితనం అవుతుంది. కఠినంగా వున్నావనుకో రాతిగుండె అంటాడు. అదే పురుషుల వైపు నుంచి నాయకత్వ లక్షణం అయిపోతుంది . నువ్వు జాబ్ లో వున్నావు. నే యుద్యోగం ఎంతవరకు మాతృ స్థానంలోకి వెళ్లి ఎవరికీ ఆదరింపులూ అక్కర్లేదు. నీ అందం పట్ల ఎదుటివారి పొగడ్తలు వద్దు. నువ్వు నువ్వుగా వుండు. నీతోటి స్త్రీల విషయంలో  ఇలాంటి విమర్శలొస్తే వెంటనే ఖండించు. ఏమంటావ్ !

Leave a comment