ఇంటి ముందు కాస్తంత చోటున్నా సరే నాలుగు కుండీలు పెట్టి తులసి మొక్కలు నాటండి. దోమల్ని పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చిన్న రిపోర్ట్ వచ్చింది. ఇరుగ్గా వుండే మూలల్లో వుండే సామాన్లు క్లియర్ చేసి నీళ్లు నిలవకుండా చేసి ఆరోగ్యానికి హాని చేయకుండా వుండే దోమల  మందు వాడి ముందు అనారోగ్యాలు రాకుండా చూసుకోమంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. గత ఐదు దశాబ్దాలలో దోమల సంఖ్యా పెరగవలిసిన దానికంటే పదిరెట్లు అధికంగా పెరిగాయట. ఇటీవల అమెరికాలో డెంగ్యూ ఎల్లో ఫీవర్ , చికన్ గున్యా వంటి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా విపరీతంగా పెరగటానికి గల కారణాలు అన్వేషిస్తూ అడవులు నరికేయటంలో ఆకుపచ్చ వనాల్లో తమ జీవన చక్రాన్ని కొనసాగించే అడ్వై దోమలు నగరాలకు వలస వచేస్తున్నాయని తేలింది. దోమలు రానీయకుండా చేసే కొన్ని రకాల మొక్కలుంటాయి. అవన్నీ వెతికి పట్టుకుని ఇంటి చుట్టూ నాటుకోండి అంటున్నారు పరిశోధకులు.

Leave a comment