ప్రపంచం మొత్తం ద్రుష్టి  పెట్టె  రెండు  సినిమా  ప్రోగ్రాములు ఉన్నాయి.  ఒకటి ఆస్కార్  రెండు గోల్డెన్ గ్లొబ్. హాలీవుడ్ నిర్మాత హార్వీ  వైన్ స్టీన్ లైంగిక  వేధింపుల గురించి  మీటు  ఆన్ లైన్  ఉద్యమం లో  ఏంటో మంది తమపై   జరిగిన ఎన్నో వేధింపులను  బయట  పెట్టాక దీన్ని ప్రపంచం దృష్టికి  తీసుకు పోదాం  అని  నిర్ణయించుకున్నారు ప్రముఖులందరూ. హాలీ వుడ్  తో పటు  మొత్తం  ఎంటర్ టైన్మెంట్, మీడియా  రంగంలో జరుగుతున్న  అకృత్యాలకు   వ్యతిరేకంగా గోల్డెన్ గ్లొబ్ అవార్డుల ప్రధానోత్సవానికి  వచ్చిన వారంతా  నల్ల దుస్తులలో  దర్శనం  ఇచ్చారు. మగవాళ్ళు  కూడా నల్ల  దుస్తులు వేసుకుని   సాంఘీ భావం  వెల్లడించారు. మీటు  ఉద్యమం  మరింత మంది ద్రుష్టి లోకి వెళ్ళింది, ఈ నిరసన తో. బాధిత మహిళందరికీ ఇది  ఊరట.

Leave a comment