అలీసా మాంక్స్ పెయింటింగ్స్ కోసం ఆమె గ్యాలరీ లో వెతకండి. ఎన్ని సోలో ఎగ్జిబిషన్స్ ,ఎన్ని గ్రూప్ ఎగ్జిబిషన్స్ లెక్కలేనన్ని. ఆమె బయోగ్రఫీ చుస్తే లిస్ట్  మొత్తం కనిపిస్తుంది. ఆమె పెయింటింగ్స్ అన్ని ఫొటోల్లా ఉంటాయి. కానీ అవన్నీ అలీసా మాంక్స్ కుంచె తో వేసిన పెయింటింగ్స్ న్యూయార్క్ లో వుండే మాంక్స్ కు అత్యంత సహజమైన చిత్రాలు వేసే పెయింటర్ గా  ఎంతో పేరుంది. మేని ఛాయా ను కంటి మెరుపును కూడా అత్యంత సహజంగా చిత్రించగలిగారమే. నీళ్లలో ఓ అందమైన అమ్మాయి స్నానం చేస్తున్న పెయింటింగ్ అనుకోండి నీళ్లు సహజమైన రంగులోనే స్నానం చేసే అమ్మాయి సహజంగానే. మొహం నిండా నీటి బిందువులున్నాయి. ఒక అందమైన అమ్మాయి చిత్రంలో అవి నిజంగానే నీళ్లు రాలుతున్నట్లే వున్నాయి. ఇంకెన్నో చిత్రాలు మాంక్స్ గొప్పతనం చాటేందుకు !!

Leave a comment