బంగారు రంగులో వుండే గుమ్మడి కాయతో ఒక సైడ్ డిష్ తయారు చేసుకోవచ్చు. ఎన్నో పోషకాలకు నిలయంగా వుండే గుమ్మడి కాయను తీసుకుని  సగానికి కట్ చేసి గింజలు తీసేసి, నూనె ఉప్పు, మిరియాల పొడి రబ్ చేసి ఓవెన్ లో 40 నిమిషాలు రోస్ట్ చేయాలి. కాయ గుజ్జు పూర్తిగా మిట్ట బడాలి. అప్పుడు ఆ గుజ్జును తీసి, కొద్దిగా పాలు పోసి  చిదిమి దాని లో కొంచెం వెన్న కలిపి ఆ గుజ్జును రోటీలు, పరాటాలు, బ్రెడ్ తో తినచ్చు. చాలా రుచిగా వుంటుంది. గుమ్మడి లో కాన్సర్ తో పోరాడే విటమిన్ ఎ , కెరోటినాయిడ్లు అధికంగా ఉన్నాయి. ప్రోస్ట్రేట్ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కూరగా, స్వీట్లు ఇతర పదార్ధాలతో కలిపి ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చును.

Leave a comment