టాప్ ఫ్యాషన్ డిజైనర్స్ తయారు చేసే అందమైన డ్రెస్ లు రెడ్ కార్పెట్ పైన నడిచే అందమైన హీరోయిన్ లు వేసుకోవటం చూస్తూ ఉంటారు అందరు. అలాటివి వేసుకొంటే ఎంతో బావుంటుందీ. కానీ అవి లక్షల ఖరీదు చేస్తాయి. అందుకే ఆలా అమ్మాయిలు సరదా తీర్చటం కోసం మనీష్ మల్హోత్రా వంటి ఫెమస్ డిజైనర్స్ తయారు చేసిన డ్రెస్ లు అద్దెకిస్తామని ముందుకు వచ్చాడు ఢిల్లీకి చెందిన సంచిత్ బవేజా. స్టేజ్ 3 ఫ్యాషన్ ఆన్ వీల్స్ పేరుతొ ఈయన ప్రారంభించిన స్టార్టప్ లో ఒక అద్దాల బస్ లో ఈ డిజైనర్ డ్రెస్ లు పెట్టి ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఉంచుతారు. డ్రెస్ లు కావాలనుకొంటే ఈ బస్ లో వాటిని వేసి చూసుకొని అద్దెకు తీసుకోవచ్చు,ఇందులో ట్రయిల్ రూమ్,డ్రెస్ ను సరిగా ఫిట్ గా కుట్టి ఇచ్చే టైలర్ కూడా ఉంటాడు. ఇప్పుడీ స్టార్టప్ సక్సస్ ఫుల్ గా నడుస్తోంది.

Leave a comment