బరువు తగ్గేందుకు గాను కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ శరరం అలిసిపోయేంతగా వ్యాయామాలు చేస్తే ప్రమాదం అంటున్నారు పరిశోధికులు. 30 ఏళ్ళు వచ్చే వరకు ఎముకలలో ఎదుగుదల ఉంటుంది. ఆ తర్వాత బలహినమై పోతుంటాయి. పోషకాహారం తీసుకుంటూ వుంటేనే ఎముకలు పటుత్వంతో ఉంటాయి. బరువు తగ్గేందుకు పుష్టికరమైన ఆహారం మానేసి తీవ్రమైన వ్యాయామాలు చేస్తే ఎముకలు అరిగిపోతాయని చెపుతున్నారు. శరీరం బరువు తగ్గించు కోవాలనుకునేవారు ముందు పౌష్టికాహారం పైన దృష్టి పెట్టి అటు తర్వాతనే వ్యాయామాలు చేయాలి. ముప్పయి ఏళ్ళు దాటిన మహిళలు రోజుకు రెండు వేల క్యాలరీలు తీసుకోవచ్చునంటున్నారు.

Leave a comment