అప్పుడు నాకు 14 ఏళ్లు. పూజ గదిలో ఉండగా నా ఫస్ట్ పీరియడ్ వచ్చింది పూజ లో ఉన్న మా పిన్ని కి మోచేత్తో పొడిచి విషయం చెప్పాను.పక్కన ఉన్న ఇంకో బంధువు నవ్వి పర్లేదు దేవుడు క్షమిస్తాడు అన్నది.నమ్మను నేను. అదేం పెద్ద పాపం కాదని సహజమని అంటూ ట్విట్టర్లో పోస్టు చేసింది శ్రద్ధా శ్రీనాథ్. రెడ్ డాట్ చాలెంజ్ స్వీకరించింది శ్రద్ధా. అర చేతిలో చుక్క పెట్టుకున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో పెట్టేసి. ఈ పీరియడ్ చుట్టూ ఉన్న అస్పృశ్య ఆలోచనలు పోగొట్టేందుకు ఈ రెడ్ డాట్ చాలెంజ్ లో సొంత అనుభవాలు పోస్టింగ్లు ఎంతో ఉపయోగపడతాయి అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్.

Leave a comment