టాటూ లు వేయించుకోవాలని చాలామంది ఇష్టపడతారు కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదకరం కాదంటారు కాస్మటాలజిస్ట్ లు. కలర్ పెగ్మెంట్ ను చర్మం పొరల్లోకి కావలసిన డిజైన్ లో ఇంజెక్ట్ చేసి టాటూ వేస్తారు.చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్లు ఉన్న వాళ్లు టాటూ లకు దూరంగా ఉండాలి. టాటూ వేసే వ్యక్తి సరైన జాగ్రత్తలు తీసుకొన్నాడా లేదో చూడాలి. గ్లౌస్ లు వేసుకున్నారా? సామాగ్రిని స్టెరిలైజ్ చేశారా? సూదులు మొదలైనవాటిని మన ఎదురుగా సరికొత్త ప్యాకెట్ లోంచి తీశారో లేదో గమనించుకోవాలి.టాటూ వేయించుకున్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మాయిశ్చరైజర్ రాయాలి.ఎండలోకి వెళ్ళకూడదు.పూర్తిగా మానేందుకు రెండు వారాలు సమయం తీసుకొంటుంది.

Leave a comment