కొంతమంది ఎడమ చేతి వాటంతో ఉంటారు. తినటం రాయటం ఎడమచేతి తోనే . అందరూ కుడిచేతి వాడుతూ ఉంటే కొందరే ఎడమ చేతితోరాయడం వింతగానే ఉంటుంది . దీనికి కారణం జన్యువులే అంటారు పరిశోధకులు . ఈ జన్యువు మెదడులోని భాషకు సంబంధించిన భాగంతో అనుసంధానమై ఉంటుందనీ . ఆ భాగంలో కణాల అమరికలో వ్యత్యాసం ఉండటంవల్ల ఎడమ చేయి వాడతారని చెపుతున్నారు . ఇలా ఎడమచేతిని వాడే వాళ్లలో మెదడుకి ఇరువైపులా భాషా భాగాలు ఒకదానితో ఇంకొకటి ఎక్కువ సమన్వయంతో పనిచేస్తాయని ,వాళ్ళలో భాషా పరిజ్ఞానం ఎక్కువ ఉంటుందని చెపుతున్నారు . గర్భస్థ దశలో శిశువు పెరుగుదలలో మెదడు ఏర్పడుతున్న క్రమంలో ఈ కణాల అమరిక రూపుద్దిదు కొంటుంది . ఎడమ చేతివాటం వల్ల ఎలాటి నష్టం లేదంటున్నారు .

Leave a comment