భోజనం వేళలో కాకుండా ఇంకా ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటే అది ఆకలి కాకపోవచ్చు కేవలం భావోద్వేగం అంటున్నారు ఎక్సపర్ట్స్. ఆకలి లేకుండా ఏదో ఒక భావోద్వేగం తో చాలామంది తినేందుకు ప్రాధాన్యత ఇస్తారు అంటున్నారు. దీని వల్ల అదనపు క్యాలరీలు చేరి బరువు పెరుగుతారని ఇది కేవలం అలవాటు మాత్రమే అంటున్నారు. అలాంటప్పుడు ఇంట్లో హెల్ది స్నాక్స్ మాత్రమే ఉంచుకోమని దానివల్ల కాస్త తిన్న బరువు పెరగకుండా ఉంటారని చెబుతున్నారు. కనుక అలిసిపోతే బాగా విశ్రాంతి తీసుకోవాలి. మనసు వత్తిడి కలిగితే దాన్ని తగ్గించే ఇతర మార్గాల గురించి ఆలోచించుకోవాలి అంతేగాని చిరుతిండి వైపు మనసు మళ్ల నీయదు అంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment