అన్ లైన్ లో అస్తమానం చదువుతున్నారా? అయితే ఈ అలవాటు ఇంటర్నెట్ నిరంతరం చూసే అలవాటు పెంచేసి మానసికంగా గందరగోళానికి దారి తీస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ మధ్య కాలంలో ప్రింట్ మీడియాలో పేపర్స్ ,నవలలు ,కథలు చదవటం తగ్గిపోతూ ఆన్ లైన్ రీడింగ్ ఎక్కువైంది.అయితే వెబ్ సైట్ లో చదివినదానికి కంటే పేపర్లలో ప్రింట్ చదివితేనే గుర్తుంటాయంటున్నాయి పరిశోధనలు.వెబ్ పేజీలు,వాటికి అనుసంధానంగా లింక్ లు ఒక విషయంలోంచి ఇంకో అంశంలోకి వేగంగా మారిపోవటం దృష్టిని మళ్ళీస్తాయని దీనికంటే ప్రింట్ లో చదువు కొంటేనే జ్ఞాపకం ఉంటాయి అంటున్నారు.

Leave a comment