వేసవిలో ఎక్కువ నీళ్ళు తాగాలా? డీహైడ్రేషన్ కాకుండా ముందు జాగ్రత్తాలేమిటి అంటూ ఉంటారు. నీళ్ళు తాగేందుకు ఫార్మూలా ఏమీ ఉండదు. దాహం వేస్తే నీళ్ళు తాగాలి.  జ్యూస్ ,పాలు ,మజ్జిగ ,కొబ్బరి నీళ్ళ రసం , సూప్ , కాఫీ, టీలు కూడా నీళ్ళ కిందకే వస్తాయి.  దాహం వేస్తున్నట్లు , నోరు ఎండి పోయి, గొంతు ఎండి పోయి ఉంటే ఈ  లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో నీటి స్థాయి తగ్గిందని అర్థం చేసుకోవాలి.  వ్యాయమాలు చేస్తున్న ,ఎండలోకి వెళ్ళినా నీటి అవసరం మరింత ఎక్కువవుతుంది.  ఒకే సారి గ్లాసుల కొద్దీ నీరు అవసరం ఉండదు.  సోడియం, ఇతర లవణాలు డైల్యూట్ అయిపోతాయి.  దాహమైనా కాకపోయిన రోజంత మంచి నీళ్ళు తాగటం మంచి అలవాటు.

Leave a comment