ఎప్పుడు తినేదే అయితే ఏం మజా !  ఓ కొత్త రకం రుచి కళ్ళకి మనసుకీ నచ్చేదేదైనా ఉంటే దానికి పెద్ద మార్కెట్ సిద్ధంగా ఉంటుంది. టోక్యోలోని కిస్పోషియా రెస్టారెంట్ ఓనర్ క్లియర్ చికెన్ సూప్ బ్లూ పేరుతో ఇన్ స్ర్టాగ్రామ్ లో ఓ ఫోటో పెడితే అదిప్పుడు వైరల్ .చైనాకు చెందిన పురాతన పద్ధతి చింతన్ ను ఉపయోగించి మాంసాన్నీ ఓ ప్రత్యేక పద్ధతుల్లో ఉడికిస్తే ఈ నీలం రంగులో ఉన్నా చికెన్ సూప్ తయారైందట. ఇందులో మేమేమీ కలపలేదు. సంప్రదాయపద్ధతిలో తయారు చేశాం అని,అయితే ఇందులో నీలం రంగుకు కారణం ఏమిటో మాత్రం మేము చెప్పం అన్నారట.రెస్టారెంట్ వాళ్ళు ఇంకేం ఇప్పుడిక సంప్రదాయ పద్ధతులు తిరిగేసి ఎన్నో రంగుల్లో ఆహారం వండుకొవచ్చు మరి!

Leave a comment