ఇంటి పనికి ముగింపు వుండటం లేదు. ఇంకా వ్యాయామం ఎక్కడా అని నీరస పడతారు గృహిణులు. అయిటే ఈ వ్యాయామ ఫలితాన్ని అందుకునేందుకు ఇంటి పనే వ్యాయామంగా మార్చుకోండి అంటున్నారు వైద్యులు. ఒక గంట సేపు పద్దతిగా ఇల్లు తుడిచే పనిని వ్యాయామం లా లేస్తూ వంగుతూ గబగబా గది లోనుంచి నడుస్తున్నట్టు గా చేయచ్చు. దీని కోసం వీలైన పద్దతిలో ప్లాన్ చేయాలి. అంటే వేగంగా నడవడం, మెట్లు దిగటం, వస్తువులు మీదకి కిందకు మార్చడం, మెట్లు దిగడం, వస్తువులు మీదకి కిందకు మార్చడంఇవన్నీ ఇల్లు శుబ్రం చేసే ప్రాసెస్ లో చేసే పనులే. గంట సేపు విశ్రాంతి ఇవ్వకుండా శరీరం వంగేలా అచ్చం వ్యాయామంలా ఇంటి పనిని చేసే విధానాన్ని కనిపెట్టాలి. ఇల్లు సర్దటం, డస్టింగ్, ఊడ్చడం, నీళ్ళతో తుడవడం పద్దతిగా వళ్ళు కదిలేలా   చేసేట్టు మలుచుకుంటే చాలు కాలి కండరాళ్ళు , పొట్ట కండరాళ్ళు చురుగ్గా స్పందిస్తాయి.అదనంగా పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. దీన్ని ప్రాక్టీస్ చేస్తేఎలా వుంటుందో ఎవ్వరికి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి.

Leave a comment