ఆఫీస్ లో భోజనం అయ్యాక కాళ్ళు కురుకుపోతుంటే చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇంత మంది మద్యని ఈ నిద్ర ఏమిటి? ఆవులింతలు ఏమిటి అని తిట్టుకుంటారు. అయితే ఈ మధ్యాహ్నం వచ్చే నిద్ర పైన అంత చిరాకు అక్కరలేదని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పై నిర్వహించిన వివిధ అద్యాయినాల్లో మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు శక్తి తగ్గి పోతుందిట. అప్పుడు ఎంత కష్ట పడాలన్నా పని సాగదు. మన శరీరం లోని జీవ గడియారం దాన్ని విశ్రాంతి సమయం అని నిర్ధారించుకుంటుందిట. ఎందుకంటే మనం లంచ్ అవర్ అని మనసుకి చెప్పేసుకుని పని కత్తి పెట్టి భోజనం చేస్తాం కదా శరీరం తినగానే విశ్రాంతి కోరుకోవడం సహజం. అయిటే అది ఆఫీస్ కనుక పది నిమిషాలు రెస్ట్ కళ్ళు మూసుకుని కూర్చోండి చాలు. ఆ ఫీలింగ్ పోయి ఫ్రెష్నెస్ వస్తుందని చెప్పుతున్నారు.

Leave a comment