దుఖ:నికి ,బాధాకీ ఏడుపు ఒక జౌషధం, ఓ ఉపశమనం . ఎలాంటి నొప్పికైయినా తిరుగులేని సమాధానం ఏడుపే. కన్నీళ్ళకు గొప్ప హీలింగ్ పవర్ ఉందంటారు ఎక్స్ పర్ట్స్. మనకు స్వాంతన ఇచ్చేది కన్నీళ్ళే. కన్నీళ్ళు బలహీనత అనుకుంటూ పెద్దయ్యాక ఏడుపును మనసులోనే దాచుకొనేందుకు ప్రయత్నం చేస్తాం. అలవాటు చేసుకొంటాం కూడా. కష్టానికి సుఖానికి కళ్ళల్లో సుడులు తిరిగే కన్నీటి వరదను ఆపోద్దంటారు విజ్ఞునులు. మనసారా ఏడిపిస్తే సగం దిగులు పోతుంది. ఎప్పుడు ఏడుపు వచ్చిన మనసారా కన్నీళ్ళు పెట్టుకొండి, వాటిలోంచి కష్టం ,దుఖ:ం కరిగిబయటకు కొట్టుకు పోతాయంటున్నారు .హాయిగా ఏడ్చేయటం మంచిదే!

Leave a comment