ఇంట్లో ఎదో ఒక పని చేస్తూ విపరీతంగా తిరుగుతాం కదా ఇంకా వాకింగ్ ఎందుకు అనుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు. ఇందువల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు. వేగం దూరం పైన ఆధార పడి వుంటుందిట వాకింగ్ అన్నది. 45 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అప్పుడు శరీర రక్త ప్రసరణలో తేడా వచ్చి జీవక్రియలన్నీ చైతన్యవంతమై శరీరం శక్తిని పొందుతుంది. తప్పా అటూ ఇటూ తిరగడం వాకింగ్ కిందకు రాదు అంటారు. శ్వాస వేగం పెరిగేంతగా నడవాలి. అప్పుడు శరీరం లోని చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ గా మారుతుంది. శరీరంలోని ఏధో భాగానికి చేరిన చెడు రక్తం శుబ్రం కావడం కోసం తిరిగి గుండెకు వెళ్లేందుకు నడక బాగా తోడ్పడుతుంది. నిజానికి చెడు రక్తం తిరిగి గుండెకు వెళ్ళేలా చేసే వ్యవస్థ పిక్కల్లో వుంది. వాకింగ్ ద్వారా ఆ వ్యవస్థ బాగా పని చేసి చెడు రక్తం కాళ్ళల్లో నిలబడి పోకుండా చేస్తుంది. వృద్దాప్య లక్షణాలైనా, వంకరగా నడవడం, తూగు రాకుండా నడక అలవాటు జీవిత కాలమంతా నిశ్చలంగా నిలబడేలా చేస్తుంది.

Leave a comment