తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ లో ప్రీతి కేరక్టర్ చేస్తుంది కియారా అద్వాణి.సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే అదృష్టం,కృషి రెండు కావాలంటుంది కియారా. ఏ నటి అయినా విభిన్న తరహా పాత్రలు చేయాలని ఇష్టపడతారు. ఆ విభిన్నత కోసం నేను వెభ్ సిరీస్ ఒప్పుకున్నాను.నా దృష్టిలో సినిమాల కన్నా వెబ్ సిరీస్ కే ఆదరణ ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకుల దగ్గరకు వెళ్లేందుకు ఇదో మంచి అవకాశం అనుకుంటున్నాను. పైగా సినిమా అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. నా అదృష్టం కొద్దినా కెరీర్ లో మంచి అవకాశాలు,విభిన్నమైన పాత్రలు వసున్నాయి. సినిమాల కోసం ఫిట్ నెస్ కసరత్తులు పెద్దగా అక్కర్లేదు. నేను కథక్ డాన్సర్ ని . ప్రతి రోజు ఒక గంట కథక్ ప్రాక్టీస్ చేస్తాను.నా వ్యాయామం అయిపోతుంది. ఇంటి భోజనం మాత్రమే తింటాను కనుక అదంతా పోషకాహరమే.

Leave a comment