ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోంది కొన్ని పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు. చక్కెర లో బొంబాయి రవ్వ, సుద్ద పొడి కలిపి కల్తీ చేస్తారు.ఒ స్పూన్ పంచదార నీళ్లలో వేస్తే సుద్ద నీళ్లలో కరిగి,అడుక్కి రవ్వ చేరి పోయి కల్తీ జరిగినట్లు తేలిపోతుంది. బెల్లంలో మెటాలిక్ పసుపు రంగు కలిపి కల్తీ చేస్తారు. నీళ్లలో కరిగిస్తే కల్తీ బెల్లం అడుగున తెట్టు లాగా తేరి కనిపిస్తుంది. సెనగ పిండి లో మిఠాయి రంగు బియ్యం పిండి కలుపుతారు కొద్దిగా పిండి లో నీళ్లు కలిపితే నీళ్లు రంగులోకి మారితే కల్తీ తెలుస్తుంది. వెన్న లేదా నేయి లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం పంచదార కలిపితే ఐదు నిముషాల్లో అవి ఎరుపు రంగు లోకి మారిపోతాయి.

Leave a comment