Categories
Gagana WhatsApp

తాలిబన్లపై ఆఫ్ఘన్ మొదటి మహిళా మేయర్ తిరుగుబాటు

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ల పాలనపై ప్రతిఘటన మొదలైంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో శాంతి స్థాపన కోసం కృషి చేస్తామని చెబుతున్నా , ఎవరికీ ఎలాంటి హాని జరగబోదని చెబుతున్నా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా మహిళలు తీవ్ర భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మహిళలపై ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ల పాలనలో కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్న కారణంగా, ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. తాజా పరిణామాలతో 2018 లో ఆఫ్ఘనిస్తాన్‌లో మొట్టమొదటి మహిళా మేయర్‌గా చరిత్ర సృష్టించిన జరీఫా గఫారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల పాలనను ఆమె ప్రతిఘటించారు. ఆఫ్ఘనిస్తాన్ ని విడిచి పెట్టి ఎక్కడికి వెళ్ళను అని గఫారీ పేర్కొన్నారు. వార్దాక్ ప్రావిన్స్ రాజధాని నగరం మైదాన్ షహర్ మేయర్‌గా ఎంపికైన ఆమె తాలిబన్లు తనను చంపేస్తారంటూ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. గఫారీ విషయానికి వస్తే ట్రంప్ పరిపాలన మార్చి 2020 లో ఆమెకు అంతర్జాతీయ ధైర్య పురస్కారంతో సత్కరించింది. ఆ సమయంలో కూడా ఆమె తాలిబన్ల పాలనపై వ్యాఖ్యలు చేశారు .

Leave a comment