కరోనా  వ్యాధి సోకిన వారికి వెంటిలేటర్  సాయం  చాలా అవసరం.ఆఫ్ఘనిస్థాన్లో వెంటిలేటర్ల కొరత చాలా ఎక్కువ. నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే 400 వెంటిలేటర్లు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేసింది ‘ ఆఫ్ఘనిస్తాన్ డ్రీమర్స్ ‘ అనే యువతుల బృందం. వీరు కారు విడిభాగాలు ఉపయోగించి వెంటి లేటర్లు తయారు చేసి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు లాక్ డౌన్ లో ఎన్నో కష్టాలు పడి విడిభాగాలు సేకరించి వెంటిలేటర్లు రూపొందించారు. మా ప్రయత్నం వల్ల ఒక్కరి ప్రాణం కాపాడగలిగిన సంతోషిస్తాం అంటున్నారు.ఈ యువతులు కొత్త అవసరాలు ఆవిష్కరణలకు ఊపిరి పోస్తున్నాయి.

Leave a comment