డ్రైవింగ్ టెస్ట్ కోసం కార్లో కూర్చున్నాక ,కాస్త నెర్వస్ గా అనిపించింది . కాసేపు మాట్లాడాక నార్మల్ అయ్యాను అసలీ లైసెన్స్ నాకెంతో అత్యవసరం అన్నది విన్నీ శాంపి ఆనందంగా 75 ఏళ్ళ వయసులో ఆమెకు నిజంగానే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరం . బ్లడ్ వుడ్ ట్రీ అసోసియేషన్ ఈ లైసెన్స్ కోసం చాల సహాయం చేశారు ఆమెకు . ఇప్పుడంత అవసరం ఏమిటీ అంటే ఈ 75 ఏళ్ళ ఆమెతో ఆమె అక్క కూడా నివశిస్తుంది . వయసు మీదపడ్డ కారణం గా మాటిమాటికి ఆమె ను ఆస్పత్రికి తీసుకుపోవలసి వస్తుంది . అలా తీసుకు పోయేందుకు డ్రైవింగ్ నేర్చుకుంది విన్నీ . లిఫ్ట్ అడగాల్సి వస్తోంది . టాక్సీ మాట్లాడుకోవలసి వస్తోంది . మా అవసరాల కోసం ఎవరి పైన అదరపడకుండా ఉండేందుకు నేనీ లైసెన్స్ సంపాదించు కొన్నా అంటోంది విన్నీ శాంపి .

Leave a comment