చర్మం పైన ముడతలు రావడం చర్మం సాగిపోవటం అనేది సాధారణంగా పెరిగే వయస్సుకు సంకేతాలుగా భావిస్తుంటారు కానీ నిజానికి ఇది ఒత్తిడి పోషకాహార లోపాలు శరీరం లో ఇన్ ఫ్లమేషన్ లకు సూచనలు కావచ్చు .చర్మాన్ని బిగుతుగా ఉండేందుకు ఉపకరించే కొలాజెన్ సరఫరా చక్కెర వల్ల తగ్గిపోతుంది. కనుక తీపి తినటం తగ్గించాలి డీహైడ్రేషన్ వల్ల చర్మం ముడతలు పడుతుంది గనుక బాగా నీళ్లు తాగాలి ఒత్తిడి వల్ల పేరిగే కార్టిసాల్ హార్మోన్ చర్మ ఆరోగ్యానికి తోడ్పడే ఖనిజ లవణాలు హరిస్తుంది. కనుక ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు వెతుక్కోవాలి. యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభించే పండ్లు కూరగాయలు తినాలి.

Leave a comment