ఫిట్ నెస్ కోసం వ్యాయామాలు మొదలు పెట్టినప్పుడు కేవలం జీమ్ లో  చేసే కష్టం వల్లనే శరీరం తీరుగా అయిపోదు. ఆహార నియమాలు తప్పనసరి. డైటీషయిన్ ఎంత కొలతలతో  ఎలాంటి ఆహారం నిర్ణయిస్తారో చూసుకూవాలి. ఉద్యోగ భాద్యతలు ఉంచుకొని ఆహారాలు తయారు చేసుకొనే  సమయం  ఉండదు. అప్పుడు క్యాలరీలు తగ్గించుకొని ,తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఈ కోవలోకి వస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువ గనుక క్యాలరీలు తక్కువగా అందుతాయి. వెజిటబుల్ సూప్స్ కడుపు నింపేస్తాయి. గింజ ధాన్యాలు, తరుణ ధాన్యాలు తినడం వల్ల ఎక్కువగా ఆకలి త్తేరి పోతుంది. వీలైనన్ని మంచి నీరు తాహ్గాలి. అన్నం తినగానే పండ్లు తినడం, టీ తాగడం వద్దు.  ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే బీన్స్ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఆహార విధానాల వల్ల, వ్యాయామాల వల్లనో తీరైన ఆకృతి వచ్చేస్తుంది.

Leave a comment