కరోనా సమయంలో శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు తీసుకోమంటారు.ఈ సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు నీరు ఆహారం ద్వారా అందుకోవటం. సగటు వ్యక్తి కి ప్రతిరోజు 2000 ల క్యాలరీలు ఆహారం కావాలి మగవారికి ఆడవారికి కంటే ఎక్కువ కేలరీలు అవసరం వ్యాయామం చేసే వారికి గర్భిణీలకు, బాలింతలకు ఆటలాడే వాడికి కార్బోహైడ్రేట్లు ఎక్కువ కావాలి శ్రమ తక్కువగా ఉండి ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి కేలరీలు కార్బోహైడ్రేట్లు తక్కువ కావాలి. టీనేజ్ ఆడపిల్లలకు ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వాలి. ఈ ఆహారం సప్లిమెంట్ల ద్వారా ప్రోటీన్ షేక్,విటమిన్ల మాత్రల ద్వారా కాకుండా వివిధ రకాల పప్పులు, గింజలు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పాలు పదార్థాలు రోజువారి ఆహారంలో భాగంగా కావాలి.
Categories