శరీరంలో జరిగే మార్పులు వలన మొహం రంగు తగ్గటం పెదవులు నల్లబడటం జరుగుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్.
కొన్ని పదార్ధాలు నిత్యం తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆ సమస్యలు రావంటున్నారు. ప్రతి రోజు ఒక స్పూన్ తేనె తీసుకొని పెదవులకు అప్లై చేయాలి. తేనెలోని యాంటీ అక్సిడెంట్లు మెఘ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి ఆరోగ్యన్నిస్తాయి. పెదవుల పై నలుపు పోతుంది. అలాగే రోజుకో టమాట తిన్న సరే వీటిల్లోని సెలీనియం అనే యాంటీఆక్సిడెంట్ చర్మాన్ని పెదవులను కాపాడుతుంది. ఈ ఎండల్లో బయటకు వెళ్ళిరాగానే పెదవులకు టమాట గుజ్జు లేదా తేనెలో కలిపిన టమాటా రాస్తే మంచిది. అలాగే పెరుగు కుడా చర్మాన్ని యవ్వనవంతంగా ఉంచగలుగుతుంది.

Leave a comment