జీవితంలో ఎన్నో ఒత్తిడులు డిప్రెషన్ కలిగిస్తాయి. ఆ కుంగుబాటుకు మంచి వైద్యం ఆరోగ్యకరమైన ఆహారం అంటున్నాయి అద్యయనాలు. శరీరంలో సెలీనియం తక్కువైతే డిప్రెషన్ వస్తుంది. కనుక సెలీనియం ఉండే ముడి ధాన్యాలు ,సీ ఫుడ్ ,మేక,కోడి కాలేయ భాగాలు తినాలి.విటమిన్ డి తక్కువైనా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి.చేపలు,పుట్టగొడుగులు తింటే మంచిది. అలాగే అవిసె,పిస్తా,బాదం,వాల్ నట్స్ ,పండ్లు ,కూరగాయలు మొదలైనవన్ని ఒత్తిడి పరమైన సమస్యలను తగ్గిస్తాయి.బీన్స్,పప్పు దినుసులు పాలు,గుడ్లు చేపలు కూడా శరీరానికి ప్రోటీన్ అందించి ఒత్తిడిని తగ్గేలా చేస్తాయి.

Leave a comment