ఎన్నో మనసుని బాధించే విషయాలు మెనోపాజ్,పరీక్షల ఒత్తిడి లాంటి సమస్యలతో చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు.ఈ సమస్యకు మందులు వద్దు మంచి ఆరోగ్యకరమైన ఆహారంతో పరిష్కారం ఉంది అంటున్నాయి అద్యాయనాలు. స్వీట్లు,ప్రాసెస్ డ్ పదార్ధాలు మానేసి చక్కని పోషకాహారం తీసుకుంటె డిప్రెషన్ తగ్గుతుంది.శరీరంలో సెలీనియం తగ్గితే డిప్రెషన్ లక్షణాలు వస్తాయి.ముడి ధాన్యాలు సీ ఫుడ్ తో ఈ సమస్య పోతుంది అంటున్నారు.విటమిన్ డీ లోపం వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు అంటున్నారు. అలాంటప్పుడు ప్రతిరోజు ఎండలో కాసేపు తిరిగితే లేదా చేపలు, పుట్టగొడుగులో తింటే కూడా మంచిదే. విటమిన్ ఏ,సి,ఇ లు సమృద్దిగా ఉండే పండ్లు కూరగాయలు తింటె వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడి సమస్యలను తగ్గిస్తాయి.

Leave a comment