కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్ కాటుక వంటి ఉత్పత్తులు జీవిత కాలం ఆరునెలలే. కనుక అంతకుమించి వాడకపోవడం బెస్ట్.అలాగే ఎంత రాత్రైనా  మొహం పైన రాసుకునే ఫౌండేషన్ క్రీములు మేకప్ తొలగించే పడుకోవాలి. లేకపోతే ఆ రసాయనాలతో మొటిమలు మచ్చలు ఎదురవుతాయి . కాను బొమ్మల్ని తీర్చిదిద్దుకునే సమయం లేనప్పుడు చాలాసార్లు ఫ్లక్కర్ వంటి చిన్న పరికరం తో లాగేస్తూ వుంటారు. అలా లాగేసి కనుబొమ్మల వెంట్రుకలను తీసేస్తే పల్చగా అయిపోతాయి. దాంతో ,ముఖం పెద్దగా వయసు  పైబడినట్లు అయిపోతుంది. వీటికోసం ప్రత్యేకంగా ఉండే జెల్ రాసుకుంటే కనుబొమ్మలు దట్టంగా కనిపిస్తాయి. అలాగే కళ్ళ అలంకరణకు ఉపయోగించే బ్రెష్ లు తరచూ మార్చాలి. వారానికి ఒకసారి షాంపూ తో శుభ్రం చేయాలి. లేకపోతే కళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తుంది . మనం చేతి వేళ్ళతో కీ బోర్డు ఉపయోగిస్తాం. అలాగే ఇంట్లో ఎన్నో శుభ్రం చేసే పనులు చేస్తాం. అదే చేతుల్ని మొహం పైన పెట్టేస్తే వేళ్ళపై క్రిములు ముఖం పై చేరి చర్మ రంధ్రాలు మూసేస్తాయి. మొటిమలు వస్తాయి. చేతులు శుభ్రం చేసుకోకుండా మొహం పై పెట్టుకోకూడదు.

Leave a comment