తమిళనాడులో తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణంకు షుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐరావతేశ్వరుడ్ని చూసి తరిద్దా రండి.

ఈ ఆలయం చోళుల రాజ్యంలో నిర్మించారు.దుర్వాస మహాముని కోపానికి ఇంద్రుని వాహనమైన ఐరావతం తన తెల్లని రంగు శాపం వలన మారిపోయింది. శాపవిమోచనకు ఐరావతం ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థించగా పూర్వ రూపాన్ని రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వరుడు ప్రసాదిస్తాడు.ఈ దేవాలయంలోని మెట్లు ధ్వనించే విధంగా ఉంటాయి.ఇక్కడ యమతీర్ధం అనే కోనేరులో స్నానం చేసిన సర్వ పాపాలు తొలగించి మోక్షం పొందుతారు. ఇక్కడ నందీశ్వరుడు కూడా దర్శనం ఇస్తాడు.
.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పొంగలి

              -తోలేటి వెంకట శిరీష 

Leave a comment