ఈ ఏడాది వరుసగా మిసెస్ కేరళ గ్లోబల్, మిసెస్ సౌత్ ఇండియా డాజ్లింగ్ స్మైల్ తో పాటు మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది కేరళకు చెందిన ఐశ్వర్య జయచంద్రన్. ఇంజనీరింగ్ చదివే సమయంలో మోడలింగ్ ప్రారంభించి అందాల పోటీల్లో పాల్గొని మిస్ కన్యాకుమారి టైటిల్ గెలుచుకుంది తర్వాత ఆర్.జె గా కెరీర్ ప్రారంభించింది ఐశ్వర్య. పెళ్లి తర్వాత అబుదాబి లో స్థిరపడ్డ ఐశ్వర్య మిసెస్ యూనివర్స్  పోటీలకు సిద్ధమవుతోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కలలు నిజం చేసుకునేందుకు వెనకాడ వద్దు అంటుంది ఐశ్వర్య.

Leave a comment