కడుపులో ఆకలిగా ఉందేమో  అందుకే  నిద్రపోవటం లేదేమో చూసుకోండి . అంటున్నారు ఎక్స్ పెర్ట్స్ డైటింగ్ వల్లనో ఇంకేమైనా కారణం చేతనో ఏమీ తినకుండా పడుకుంటే ఆకలితో నిద్ర రాదు. ఇలా నిద్ర పట్టని రాత్రివేళ వెంటనే ఓ కోడిగుడ్డు ఉడికించి తిని చూడండి . ఐదు నిమిషాల పని. అదీ ఓపిక లేదా ఓ పండు తినండి. ఒక్కసారి హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల  కూడా సరిగ్గా నిద్ర పట్టదు. దీన్ని  అధికమించాలంటే వ్యాయామాన్ని జీవితంలో ఓ భాగం చేసుకోండి. ముఖ్యంగా పడుకునేముందర వీలైతే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. గదిలో వెలుతురు ఎక్కువగా వున్నా నిద్ర రాదు. కాబట్టి వీలైనంత తక్కువ డిమ్ లైటింగ్ ఉండాలి. నిద్రపోయే ముందు ఫోన్లో లాప్ టాప్ లు దూరం పెట్టాలి. పైగా ఎన్ని పనులున్నా ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించటం సరైన అలవాటు. అలాగే ఏదైనా విషయం గురించి పదే పదే  మనసులోకి తెచ్చుకోవద్దు. అసలా ఆలోచనే ముందు నిద్రకు దూరం చేస్తుంది. మనసులో దోబూచులాడే ఆలోచనల్లోంచి బయటకి రండి అంటున్నారు ఎక్స్ పెర్ట్స్.

Leave a comment