ది పబ్లిక్ ఫౌండేషన్ పేరుతో ఆహారం తో పాటు దుస్తులు, స్టేషనరీ, నిత్యావసరాలు, బొమ్మలు పేదలకు పంచి పెడుతోంది చెన్నై కు చెందిన ఫాతిమా జాస్మిన్. ఈమె దంత వైద్యురాలు పేదల కోసం నిత్యం భోజనం పెట్టాలి అనుకుందామె. అందుకే ఫ్రిజ్ లను ఏర్పాటు చేసి రోజంతా అందులో ఉండేలా ఆహారపదార్థాలు పెడుతుంది. చెన్నై లోని 15 చోట్ల ఫ్రిజ్ లు పేదలకు అందుబాటులో ఉన్నాయి.  వాలంటీర్ల సాయంతో హోటళ్లలో ఆహారం కొని, పండ్లు, మంచినీళ్లు, బిస్కెట్లు ఈ ఫ్రిజ్ లో పెడతారు. అలాగే వెల్లూరు బెంగుళూర్  లలోనూ ఇలాంటి ఫ్రిజ్ లే ఏర్పాటుచేసిన ఫాతిమా ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. దాతలు ముందుకు వస్తే డబ్బు రూపంలో కాకుండా ఏదో ఒకటి వండి ఫ్రిజ్ లో పెట్టమని చెపుతుంది ఈ డాక్టరమ్మ .

Leave a comment