కంటికి ఆకర్షణ ఇచ్చేదిగా మంచి ఘుమ ఘుమ లాడే ఆహారం కనబడగానే సాధారణంగా తిండికి సిద్దమై పోతాం. అంతేగాని ఆకలేస్తేనే భోజనం అన్న కాన్సెప్ట్ దాదాపు అందరికీ ఉండదు. ఆకలిని కలిగించే హార్మోన్ ఘెర్లిన్. ఇది కడుపులో గడబిడచేసి తిండికోసం వెతుక్కునేలా చేసే హార్మోన్. దీని ప్రభావానికి విరుగుడు నట్స్  అని చెపుతున్నారు. గుప్పెడు నట్స్ తింటే ఘెర్లిన్  హార్మోన్ స్థాయి పడిపోతుంది. ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉంటే అర్ధం లేని ఆకలికి తావుండదు. అంటారు ఆరోగ్య ఆహార నిపుణులు. తక్కువ క్యాలరీలతో పొట్టనిండి నట్లుగా ఆకలి ఆగిపోయేట్లు  చేయటం సాధ్యమే అంటారు. ఉదయాన్నే మీగడ తీసిన పాలు పెరుగు మజ్జిగ ఉడికించిన గుడ్డు కూడా ప్రోటీన్లున్నవే. అలాగే ఆకలిలేకపోయిన వాసన కూడా రుచి చూడాలనే కోరిక కలుగజేస్తుంది. నాలుక తినాలని ఆశ పెట్టేస్తుంది. దానికి ఇంకో వాసన  అంటే పుదీనా లాంటి వాసన  చూస్తేనే  ఆశక్తివంతమైన  ఆకుల వాసన నాలుకపైనా ఉన్న రుచి గ్రహకాలను తృప్తి పరుస్తాయి. దీని వల్ల  పరిమితిని మించి ఆహారం తీసుకోకపోవటం.

Leave a comment