కంప్యూటర్స్ స్మార్ట్ ఫోన్స్ రాత్రివేళ వాడితే బరువు పెరుగుతుందంటున్నారు అధ్యయనాలు. సాధారణంగా కదలకుండా కూర్చుని పనిచేస్తూ ఉంటే ఆహారం తింటే లావయిపోతామని అనుకుంటారు. కానీ ఈ అధ్యయనం బ్లూ లైట్ ఎక్సపోజర్ కు బరువుకు మధ్య అవినాభావ సంబంధం  ఉంటుందంటున్నారు స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లేట్ల నుంచి వచ్చే నీలి కాంతులు ఆకలి స్థాయిని అనేక గంటలు పెంచుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కడుపు నిండా తిన్నా సరే ఇలాంటి భావాలు  కలుగుతాయంటున్నారు. డిమ్  లైట్ ఎక్సపోజర్ తో పోలిస్తే బ్లూ లైట్ ఎక్సపోజర్ వల్ల ఆకలి ఎక్కువవుతుంది. లైట్ కు ఎక్సపోజ్ అవటం మొదలుపెట్టిన పావు గంట నుండి ఈ ప్రభావం మొదలవుతుంది. భోజనం చేసి రెండు గంటలైనా కాకముందే ఆకలి ఎందుకవుతుంది అని ఆందోళన పడేవారు ఈ నీలి కాంతులకు ఎంతగా ఎక్సపోజ్ అవుతున్నారు తరచి చూసుకుంటే తెలుస్తుంది. ఇది నిద్ర లేమి రిస్క్ ను కూడా పెంచుతుంది.

Leave a comment