ఈ చలి రోజుల్లో చక్కని చీరలు కట్టుకుంటే ఇటు హుందాతనం అటు శరీరానికి వెచ్చదనం రెండు అందుతాయి. ఈ మధ్య కాలంలో ట్రైబల్ ప్రింట్స్ వస్తున్నాయి. బ్లాక్ ప్రింట్స్ ట్రైబల్ మోటిఫ్ లు అంచుల్లో ఎంబ్రాయిడరీ వున్న నూలు చీరలు చాలా బాగుంటాయి. ప్యుర్ కాటన్, సీకోకాటన్స్ లో కుడా ట్రైబల్ ప్రింట్స్ ఎన్నో కొత్త డిజైన్స్ లో వున్నాయి. పల్లెటూరి అందాలు ప్రతిఫలించేలా పల్లెపడుచుల అందాల్ని రేఖా మాత్రం చిత్రించే ఈ డిజైన్స్ నూలు చీరలకు కొత్త అందం ఇస్తున్నాయి. లేత రంగుల చీరాలపై కేవలం దీపాల వరసులు, పల్లె పడుచులు అచ్చు వేసి ఎంబ్రాయిడరీ అందాలు జోడించిన నూలు చీరాల అందం వర్ణాలకు అతీతం. ఈ సీజన్ స్పెషల్స్ ని ఇమేజస్ చూడొచ్చు.

Leave a comment