Categories
WoW

ఆకు కూరలు హాయిగా పెంచొచ్చు.

కాస్త చోటున్నా అందంగా పెరిగే మొక్కలున్నాయి. అపార్ట్మెంట్స్ లో అంత మాత్రం ఖాళీ ఎక్కడిది. అందుకే ఒక్క కుండీ స్థానంలో ఏడెనిమిడి రకాల మొక్కల్ని పెంచుకునేలా స్టేకింగ్ పాట్స్ వచ్చాయి మార్కెట్ లోకి. ఒక దాని పైన ఒకటి పేర్చి, ఐదారుఅడుగుల వరకు ఎన్ని మొక్కలైనా పట్టేలా వున్నాయి. ఈ స్టేకింగ్ పాట్స్ అవసరమైతే కొన్నింటిని మధ్యలోకుడా వేరు చేయొచ్చు. ఆకుకూరలు చిన్ని చిన్ని మొక్కలు పెంచేందుకు అనువుగా వున్నాయి కుండీలు. ఆర్గానిక్ కూరలు తినాలి అనుకుంటే వెంటనే ఈ కుండీ కోనేసి ఎరువు కలిపిన మట్టి కూడా ఖరీదు చేసి, వెంటనే వంటింటి పక్కనే పెంచుకోవచ్చు. సేంద్రియ ఎరువులు కలిపిన మట్టి కూడా దొరుకుతుంది కాబట్టి ఇంట్లోనే కనీసం మనకి కావాల్సిన ఆకు కూరలు, కొత్తిమీర వంటివి మన చేతుత్తోనే కొసుకోవచ్చు.

Leave a comment