Categories

ప్రపంచంలో నాలుగు చోట్ల గ్రీన్ బీచ్ లున్నాయి. ఇసుకలో అలివిన్ అనే పదార్థం కలవటం వల్ల బీచ్ లోని ఇసుక ఆకుపచ్చ గా మారింది. హవాయి ద్వీపంలోని పపాకోలియా అమెరికా లోని గ్వామ్ పసిఫిక్ తీరంలోని తలొఫొఫొ బీచ్, ఈక్వెడార్ లోని ఫ్లోరేనా ద్వీపంలోని పూంతా కార్మోరాంట్ గ్రీన్ బీచ్ సహజసిద్ధమైన ఆకుపచ్చని ఇసుక ఉన్న నార్వేలోని హార్నిండల్‌స్వాట్‌నెట్ బీచ్. ఇవన్నీ అగ్నిపర్వతాలు వెదజల్లిన లావా లోంచి అలివిన్ పదార్థాలు కలిసిన ఇసుక ఉన్న బీచ్ లు నీలి సముద్రం, నీలాకాశం, ఆకుపచ్చని ఇసుక తీరం చూసేందుకు టూరిస్టులు ఉత్సాహపడతారు.