పిల్లలకు ఇచ్చే మందుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వారికి తరచూ వచ్చే జలుబూ ,జ్వరం వంటి వాటికి మెడికల్ షాపు నుంచి ఏదో ఒక మందు తెచ్చి వేస్తూ ఉంటారు . షాపుల్లో మందులకు తోడుగా యాంటీ బయోటిక్స్ కూడా ఇస్తూ ఉంటారు . అవి ఎంత డోస్ లు ఇవ్వాలో తెలియక పోతే ,ఆ యాంటీ బయోటిక్స్ వల్ల అవసరమైన బాక్టీరియా కూడా మరణించి ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు . ముఖ్యంగా పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి పోతుందంటున్నారు . వైద్యుల సలహా లేకుండా పిల్లలకు మందులు వాడకూడదని చెపుతున్నారు .

Leave a comment