Categories
ఒక సినిమాతో వచ్చిన సక్సెస్ ఒక అద్భుతం. ప్రతి సారి ప్రతి సినిమాతో అలాంటి అద్భుతాలు సాధిస్తామా అంటే అసాధ్యం. అసలు అన్నీ సృష్టించ లేము కూడా. మహానటి నా జీవితంలో జరిగిన ఒక మిరకిల్. నేను నటించాను అంతటి కీర్తి ప్రతిసారి రాదు అంటోంది కీర్తి సురేష్ . సహజంగా ఒక గొప్ప చిత్రం చేసిన తర్వాత ఒత్తిడి నాపైన అంచనాలు కూడా ఉంటాయి. ఎలాంటి కథా? ఎలాంటి పాత్ర అని కాస్త గందరగోళం వస్తుంది. అయితే ఇక మీదట పాత్రల విషయంలో ఇంకాస్త శ్రద్ధగా ఉంటాను. నటన పరంగా పాత్రల పరంగా నా శైలి ప్రేక్షకులకు అర్ధమై ఉంటుంది. అది కొంచెం నన్ను ఊరడించింది. ప్రేక్షకుల నుంచి నేను కోరేది అదేకదాఆ అంటోంది కీర్తి సురేష్.