ప్రయాణం అనగానే హడావుడిగా ఎయిర్ పోర్ట్ కు స్టేషన్ కు సామాన్లు సర్దుకుని వెళ్లే రోజులకి ఇక తెర పడినట్లే అందమైన ప్రయాణానికి కదిలే ఇళ్ళు లాంటి క్యార్ వాన్ లు వచ్చేసాయి కుటుంబ సభ్యులు, స్నేహితులతో హాయిగా క్యార్ వాన్ లోనే భోజనాలు, స్నానాలు, నిద్ర అన్నీ ప్రశాంతంగా జరిగిపోతూ, ఏకంగా  హిమాలయ పర్వత సానువుల్లో విహరించవచ్చు. సముద్రపు అలలతో కబుర్లు చెప్పచ్చు. ఏడాదిలో వెన్నెల రాత్రుల్లు గడపవచ్చు. ఇప్పటికే క్యార్ వాన్ ట్రావెల్స్ కి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ లో బాగా ప్రసిద్ది.  హాలీడేయింగ్ అంటూ కుటుంబాలు రెండు మూడు వారాలు అలా కొండకోనల్లో కి వెళ్ళి వస్తూ ఉంటారు . ఇప్పుడు మనదేశంలోనూ ఈ ట్రెండ్ మొదలయ్యింది కుటుంబంతో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలి అంటే ఇదో చక్కని సాధనం. ఈ క్యార్ వాన్ లో చక్కని ఇంటీరియర్ తో పది పన్నెండు మంది ప్రయాణం చేసేందుకు వీలుగా ఉంటాయి. డ్రైవర్ తో కలుపుకునే రేటు ఉంటుంది. క్యార్ వాన్ లో బెర్త్ లు బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, పిల్లొలు సర్వం ఉంటాయి. ట్రిప్సీ వీల్స్, కంపెనీ రోడ్ ట్రిప్ లో అరెంజ్ చేస్తారు. అన్ని సామానులు వండుకునే కిచెన్ తో సహా  ఏర్పాట్లు ఉంటాయి. మోటార్ హోమ్ అడ్వెంచర్స్ వాళ్ళు బెంగళూరు, భోపాల్, మధ్యప్రదేశ్ లో సేవల్ని విస్తరించారు. వెకేషన్ వీల్స్ క్యార్ వాన్ లో భారత దేశంలో ఎక్కడికైనా వెళ్ళచ్చు లెక్సే క్యాంపర్ ట్రెయిల్స్  గ్రీన్ డాట్ ఎక్స్ ఎడిషన్స్ వంటి కంపెనీలు  క్యార్ వాన్ లగ్జరీ రైలు ప్రయాణాలు వంటివి. కరోనా కాలంలో ఈ క్యార్ వాన్ ట్రెండ్ పెరుగుతోంది. రోజుల తరబడి ఇళ్లలో కదలకుండా కూర్చున్నా వాళ్ళు ఫ్యామిలీ ట్రిప్ ల కోసం క్యార్ వాన్ ప్రయాణం ఎంచుకుంటున్నారు.

Leave a comment